రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిటిసి యం పురేంద్ర

-ఉద్యోగులందరికీ , రవాణా రంగం లోని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని రవాణాశాఖ ఉద్యోగులకు , రవాణా రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను డిటీసీ యం పురేంద్ర తెలియజేశారు. స్థానిక బందర్ రోడ్డు లోని డిటిసి కార్యాలయంలో శనివారం నాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో డిటిసి యం పురేంద్రను మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను డిటిసి యం పురేంద్ర ఆవిష్కరించారు. ఈసందర్భంగా డిటీసీ పురేంద్ర మాట్లాడుతూ గత 20 నెలలుగా కోవిడ్ , సెకండ్ వేరియంట్, ఓమిక్రాన్ కారణంగా చాలామంది ప్రజలు అనారోగ్యాలకు గురైయ్యారని, కోవిడ్ అంటేనే భయం వేసే సమయంలో కూడా రవాణాశాఖ అధికారులు ఉద్యోగులు అంకిత భావంతో అందించిన సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కష్టతరమైన సమయాలలో ప్రాణాలను లెక్కచేయకుండా శాఖాపరంగా సేవలు అందించిన ఉద్యోగులను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అభినందించారు. శాఖాపరంగా కూడా కష్టించి పనిచేసి 2022 సంవత్సరంలో కూడా జిల్లా రవాణాశాఖను ప్రథమ స్థానంలో నిలిచే లాగా అందరూ కలిసి పని చేద్దాం అన్నారు. గత ఏడాది అనుభవాల దృశ్య కరోన వైరస్ మూడోవ వైవ్ ముంచుకొస్తుందని ఈ విషయంలో ఉద్యోగులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలలో కూడా దీనిపై చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రయాణికులను చేరవేసే వాహనాల డ్రైవర్లు మాస్క్ లు పెట్టుకున్న వారిని మాత్రమే వాహనాలలో ఎక్కుంచుకోవాలని సూచించారు. ఎక్కువ మందిని ఎక్కించవద్దని అన్నారు.

ఈ సందర్భంగా రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు యం రాజుబాబు, డి శ్రీనివాస్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగానే కోవిడ్ సమయంలో కలిసికట్టుగా పని చేశామన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల డిటిసి పురేంద్ర కనపరిచిన తీరు తమను ఎంతో ఆకట్టుకుందని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగుల విషయంలో కూడా స్పందించి సకాలంలో అందించిన సహయంను మారువలేమన్నారు. ఇటీవల డ్రైవర్ ఉద్యోగికి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారుల స్పూర్తితో నూతన సంవత్సరంలో గతంలో కంటే మిన్నగా సమర్ధతతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి పి విజయ, ఆర్టీవో జగదేశ్వర రాజు, ఎ వి సారధి, యం పద్మావతి, మంగదేవి, టెక్నికల్ అధికారుల సంఘం నాయకులు సంజీవ్ కుమార్, డి ఎస్ ఎస్ నాయక్, నాగమురళి, టి వి ఎన్ సుబ్బారావు, ఉద్యోగ సంఘ నాయకులు రామచంద్రరాజు, చంద్రశేఖర్, శ్రీను, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *