విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవ్వ తాతలు ఎవరి మీద ఆధారపడకుండా జీవించేలా ఆర్థిక భరోసా కల్పిస్తూ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచుతూ తీసుకొన్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం రోజు 2,3,19,20,21,22 డివిజన్ల లలో ల వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ నూతనంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 19,827 మంది లబ్దిదార్లుకు పెంచడం జరిగింది అని అన్నారు.ఈ నెలలో కొత్తగా 732 మందికి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది అన్నారు.ఈ ఆరు డివిజన్ లలో ఈ నెల నూతనంగా మరియు కొత్త గా మంజూరు అయిన వాటితో కలిపి దాదాపు 6570 మందికి పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అని,వాళ్ళ ప్రభుత్వం లో పెన్షన్లకి ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒకసారి చూడాలని,అంతేగాని మీ ప్రభుత్వం లాగా ఎన్నికల కు రెండు నెలలు ముందు హడావుడి గా పెంచి ఓట్లు రాజకీయాలు చేయవులేదని ఎద్దేవా చేశారు. గతంలో పెన్షన్ కావాలంటే టీడీపీ నాయకులకు లంచాలు ఇచ్చి జన్మభూమి కమిటీల చుట్టూ కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరగాల్సి వచ్చేది అని,కానీ నేడు వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే ఇంటికే పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 2వ డివిజన్ కార్పొరేటర్ నిర్మలాకుమారి, 2వ డివిజన్ కార్పొరేటర్ ప్రవల్లిక, 19వ డివిజన్ కార్పొరేటర్ రహెనా, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబెర్ రామిరెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు అధికారులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …