ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిరుపేదల వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం ల సహాయపడుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం గుణదల తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 12వ డివిజన్ కి చెందిన పాలడుగు కిరణ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్ అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 1 లక్ష 60 వేలు రూపాయలు మంజూరు చేపించి ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు పత్రం (LOC) లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆర్థిక ఇబ్బందులు అన్నీనిటీని అధిగమించి పేదలకు ప్రతి పధకం అమలు అయ్యేలా పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ పేదవాడు నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదని స్వర్గీయ వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఆధునికరించి వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య పరీక్షను ఆ పధకం ద్వారా వర్తించేలా మార్పులు చేసారని, ఏదైనా వైద్య సేవలు ఆ పధకం కిందకు రాకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ వైసీపీ నాయకులు ధనేకుల కాళేశ్వరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *