నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అవ్వా, తాతల ఆత్మాభిమానాన్ని సామజిక పెన్షన్ మరింత పెంచిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఆదివారం పెంచిన పెన్షన్ల పంపిణి కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. పెంచిన పెన్షన్ ను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్ పేద కుటుంబాలలోని అవ్వా, తాతలకు ఆత్మాభిమానం మరింత పెంచిందన్నారు. అవ్వా, తాతలకు పెన్షన్ ను దశలవారీగా మూడు వేల రూపాయల వరకు పెంచుతామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న సంవత్సరం 250, తరువాత సంవత్సరం 250 రూపాయలు పెంపుదల చేసి నెలకు 3 వేల రూపాయలు పెన్షన్ అందిస్తుందన్నారు. నూజివీడు మండలంలో కొత్తగా 354 పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, మొత్తం 10 వేల 274 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా కొత్తగా 146 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, మొత్తం 5 వేల 141 మందికి సామజిక పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ప్రతీనెలా మొదటి తేదీ తెల్లవారుజామునే అవ్వా, తాతలకు పెన్షన్ అందిస్తున్నామని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కుల, మత , రాజీకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో వినూత్నమైన సంక్షేమ పధకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబునాయుడు నూజివీడు ప్రాంతాన్ని రాజధానిగా చేస్తానని చెప్పి ఈ ప్రాంతం ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతి ప్రాంతం రాజధానిగా అనువైన ప్రాంతం కాదన్నారు. ఎన్నికలకు ముందు హడావిడిగా పధకాలు ప్రవేశపెట్టి, మహిళలను పసుపు,కుంకుమ పేరిట గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని,, అందుకే ఆంధ్ర, తెలంగాణాలలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన హామీలను నూరుశాతం అమలు చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఏ పార్టీకీ లేదన్నారు. కార్యక్రమంలో జెడ్పి వైస్. చైర్మన్ జి. కృష్ణంరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్. చైర్మన్ పగడాల సత్యనారాయణ, కమీషనరు అబ్దుల్ రషీద్, కౌన్సిలరు శీలం రాము, యంపిపి శిరీషా, వైస్. యంపిపి శ్రీవాణి, యంపిడివో జి. రాణి, మండలంలోని ఎంపిటిసి లు, సర్పంచ్ లు, వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులు, పించను లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …