విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవాణికి సంక్షేమ ఫలాలు అందాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. 46వ డివిజన్ నందు వై. ఎస్. ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పింఛన్లు పంపిణి కార్యక్రమములో మేయర్ పాల్గొని నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం పెంచిన రూ.2,500/- మొత్తాన్ని డివిజన్ నందు కొత్తగా మంజూరు కాబడిన లబ్ధిదారులకు అందజేసినారు. డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైనా 68 మందికి ఒకొక్కరికి రూ.2500/- చొప్పున రూ.1,73,000/- నగదు పంపిణి చేశారు. వీటితో పాటుగా 1190 పాత పెన్షన్ దారులకు కొత్తగా పెంచిన పింఛను 2500/- అందించుట జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమములో సి. ఓ నాగమణి మరియు స్థానిక వై. సి. పి శ్రేణులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …