కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి దర్గా ఆస్థానాన్ని ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కుటుంబ సమేతంగా సందర్శించారు. వారిని దర్గా ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా సాదరంగా ఆహ్వానించి దర్గా సన్నిధికి తీసుకుని వెళ్లారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ హోదా లో మొక్కు చెల్లించేందుకు దర్గా కు వచ్చానని, షాబుఖారి బాబా దర్గాతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ఇక్కడ నిత్యం జరిగే అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని సంతోషించానని, ఇలాంటి మహత్కార్యానికి తన వంతు సహాయ సహకారాలు అందిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరి మేలు జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.
Tags Kondapalli
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …