Breaking News

మూడు నియోజకవర్గాల పరిధిలో ఆదివారం 517 మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక ద్వారా రూ.13,24,500/- నగదు పంపిణి


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా అమలు చేస్తున్న వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక పధకం క్రింద నగర పరిధిలో పాత పెన్షన్ దారులతో పాటుగా న్యూ ఇయర్ కానుకగా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పెన్షన్ లబ్దిదారులకు రూ. 2,500/- నగదు పంపిణి కార్యక్రమములో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 52వ డివిజన్ నందు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా కొత్తగా మంజూరు కాబడిన 59 మందికి రూ.1,49,000/- లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువా చేసి వాటి యొక్క ఫలాలను సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దనే లబ్ధిదారులకు అందించుట జరుగుతుందని అన్నారు.
అదే విధంగా సెంట్రల్ నియోజక వర్గ పరిధిలో శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ 31,60,23,28,26 వ డివిజన్ల పరిధిలో కొత్తగా మంజూరైనా 181 పెన్షన్ దారులకు రూ.4,68,500/- లను మరియు తూర్పు నియోజకవర్గం పరిధిలో 20, 21, 22, 19, 2, 3 మరియు 12వ డివిజన్ లలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణి కార్యక్రమములో వై.ఎస్.ఆర్.సి.పి ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ పాల్గొని కొత్త మంజూరు కాబడిన 277 పెన్షన్లను లబ్దిదారులకు రూ. 7,07,000/- ల నగదును అందజేసారు.
పై కార్యక్రమములో ఆయా డివిజన్ కార్పొరేటర్లు, ప్రాజెక్ట్ అధికారి (యు.సి.డి ) టి.సుధాకర్ మరియు యు. సి. డి సిబ్బంది స్థానిక పెన్షన్ దారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *