Breaking News

జాయింట్ కలెక్టరు(అభివృద్ది) వారి నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టరు జె. నివాస్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యం వివిధ పనులు పరిష్కారం నిమిత్తం వచ్చే ప్రజలకు, అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు అందుబాటులో ఉండే విధంగా జాయింట్ కలెక్టరు (అభివృద్ది) వారి నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని కలెక్టరు జె. నివాస్ అన్నారు. శనివారం నగరంలోని బందరు రోడ్డు డివీ మేనర్ సమీపంలో జాయింట్ కలెక్టరు(అభివృద్ది) నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టరు జె. నివాస్ జాయింట్ కలెక్టర్లు కె. మాథవీలత, ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్‌చంద్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు సమీక్షలు నిర్వహణకుగాను ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా జాయింట్ కలెక్టరు (అభివృద్ది) వారి నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని కలెక్టరు జె. నివాస్ అన్నారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యాలయాన్ని కలెక్టరు జె. నివాస్ ప్రారంభించగా, కమాండ్ కంట్రోల్ రూమ్ ను జాయింట్ కలెక్టరు మాధవీలత, అధికారులతో సమీక్షలు మరియు వీడియోకాన్పరెన్స్ నిర్వహనకు సంబందించిన హాల్ ను జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివ శంకర్ ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *