-కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
-ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకుషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. కమిషనర్ తో పాటు మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు ఆయా శాఖదిపతులకు పంపి వాటిని పరిష్కరించుట జరుగుతుందని అన్నారు. అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వివిధ సమస్యల పరిష్కారినికి ప్రజల నుంచి 13 అర్జీలు అందుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఎస్టేట్ అధికారి శ్రీనివాస్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 4 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో రెవిన్యూ విభాగం – 1, ఉద్యానవన శాఖ -1 మొత్తం 2 అర్జీలు మరియు సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం -2 అర్జీలు స్వీకరించుట జరిగిందని జోనల్ కమిషనర్లు తెలియజేసారు. కాగా సర్కిల్ – 1 కార్యాలయంలో ఏవిధమైన అర్జులు వచ్చి యుండలేదు.