నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు లో త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయంనకు తాత్కాలిక వసతి నిమిత్తం నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు సోమవారం శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్థానిక ఎంప్లొయీస్ కాలనీలో శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు ఉత్తరువులు జారీ చేసిందని, త్వరలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం షుమారు 70 లక్షల రూపాయలతో తాత్కాలిక వసతి కొరకు భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముందుకుగా 1 నుండి 5 వ తరగతి వరకు తరగతులు ప్రారంభిస్తారని, అనంతరం వచ్చే ఏడాది నుండి 6వ తరగతి నుండి తరగతులు ప్రారంభిస్తారన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు నూజివీడు వాసుల చిరకాల వాంఛ అని, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో నూజివీడు ప్రాంత ప్రజలకు అత్యున్నత స్థాయి విద్య వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్. చైర్మన్ పగడాల సత్యనారాయణ, కమీషనరు అబ్దుల్ రషీద్, కౌన్సిలరు శీలం రాము, యంపిపి శిరీషా, వైస్. యంపిపి శ్రీవాణి, యంపిడివో జి. రాణి, ప్రభృతులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …