-గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ మహిళా సభ్యురాలు బాపతి భారతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఊర్మిళనగర్ లో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ మహిళా సభ్యురాలు బాపతి భారతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవ సందర్భంగా సోమవారం జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా విచ్చేసి సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పులామాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ రంగల నుండి ఎంపిక చేసిన మహిళమణులకు మేయర్ చేతుల మీదుగా శాలువా పుష్పగుచ్చలతో ఘనంగా సన్మానించారు. అనంతర సభనుద్దేశించి మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా భాపతి భారతి మాట్లాడుతూ మహిళ గా ఉన్న మన అక్కకో .. చెల్లికో ..అమ్మకో ..భార్యకో ఎటువంటి అవకాశాలు లేక అవస్థలు పడుతుంటే మహిళలుగా మనం ఏమి చేస్తున్నట్టు అనే ప్రశ్న నన్ను ప్రశ్నించింది అని.. అందుకే ఒక రోజు మహిళలే మహిళలను సన్మానించే రోజు రావాలని తపించాను అది ఈరోజు జరుగుతుంది. కానీ మహిళలు ధైర్యం గా సమాజం లో అన్ని స్థాయిలలో అభివృద్ధి చెందాలంటే వారికి 67 శాతం పూర్తి రిజర్వేషన్లు పొందినపుడే అని చెప్పినారు. మహిళలే మహా రాణిల గా ఎదగాలని వారి అభివృద్ధి దేశానికి ఎంతో అవసరమని పేర్కోన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ భాగ్యలక్ష్మి, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రచన , బస్ కండక్టర్ ప్రియ దర్శిని, మహిళ న్యాయవాదులు, డాక్టర్స్, యోగ టీచర్స్, మున్సిపల్ అధికారులు, టీచర్స్, సచివాలయం ఉద్యోగులు, పోలీస్ అధికారులు, రోడ్ల పై చిరు వ్యాపారులు చేసుకునే మహిళలు, బాల మదర్ థెరిస్సా జననీ, ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు శివరంజని, ట్రస్ట్ సభ్యులు శ్రీదేవి, కె.సౌజన్య, ఎస్ కె జుబేదా, ఆర్ అపర్ణ,ఎన్. మాధవి, బాల భార్గవి తదితరులు పాల్గొన్నారు.