కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు పట్టణాన్ని ఆహ్లాదకరమైన రీతిలో తీర్చిదిద్దాలను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక వివేకానంద పార్కు ను మునిసిపల్ కమీషనర్ టి. రవికుమార్ తో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, కొవ్వూరు పట్టణానికి ప్రత్యేక మైన ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ఎక్కడెక్కడి నుంచే పర్యాటకులు కొవ్వూరు కి రావడానికి కారణం ఇక్కడ గోదావరి నది తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా కావడం అన్నారు. నగరాన్ని సుందరంగా ఉంచడం తో పాటు , పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. కొవ్వూరు లోని పార్కుల నిర్వహణ విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న పార్కుల నిర్వహణ బాధ్యత ను సిబ్బందికి అప్పగించాల్సి ఉందన్నారు. ప్రతి వారం వాటి నిర్వహణ, పరిశుభ్రత ప్రాతిపదికన సమీక్ష నిర్వహించాలని మల్లిబాబు తెలిపారు. పార్కుల అభివృద్ధి కి స్థానికంగా ఉన్న పెట్రోలు బంకు నిర్వహికులు ఆసక్తి చూపుతున్నారని, వారితో కలిసి రూట్ మ్యాప్ రూపొందించాల్సి ఉందన్నారు. వివేకానంద పార్కు లో గుబురుగా ఉన్న మొక్కలను ట్రిమ్మింగ్ చెయ్యడం, వాకర్స్ నడిచేలా వాకర్స్ ట్రాక్ ఏర్పాటు పై దృష్టి సారించడం, మొక్కలు నాటడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని సూచించారు.
Tags kovvuru
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …