అందరూ బాగుండాలి.. ఇదే మన జగనన్న నినాదం..

– రెండు కళ్లుగా సంక్షేమం, అభివృద్ధి..
-అన్నివర్గాల్లోని పేదల అభున్నతే అజెండా..
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ
-మంత్రి జనాబ్ అంజాద్ బాషా..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని మైనారిటీలే కాకుండా ఇతర వర్గాల్లోని పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని వినూత్న పధకాలు మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టి అమలు దిశగా సామాజిక న్యాయం చేకూర్చడంలో మన ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  జనాబ్ అంజాద్ బాషా అన్నారు.
నగర శివారుల లోని భవాని పురంలో గల హోసింగ్ బోర్డు కాలనీలోని ఉర్దూ అకాడమీ కార్యాలయంలో గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ప్రమాణ స్వీకారం మరియు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ సచివాలయ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా అడుగులు ముందుకు వేస్తున్న ఈ వ్యవస్థతో గవర్నర్ ల హోదా లో మీ వంతు సహకారం అందిస్తూ ముస్లిమ్ మహిళలకు బాల బాలికల పభుత్వ పధకాలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన పార్టీలకు అతీతంగా అర్హులు అందరికి సంక్షేమ పథకాలు చేరాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తల్లి కడుపులో ఉన్న చిన్నారి మొదలు అవ్వ తాతల వరకూ ప్రభుత్వం పలు ఆర్థిక సహాయ విధానాలకు అండగా నిలుస్తున్నాయని, మీరు అవగాహనా చేసుకుని సలహాలు సూచనలు సచివాలయ వాలెంటరీ వ్యవస్థకు అందించాలని మంత్రి పేర్కొన్నారు.
గృహ నిర్మాణాల విషయంలో నేటికీ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణి చేసి దేశ చరిత్ర లోనే ఒక రికార్డ్ సాధించామని మంత్రి అభివర్ణించారు. ప్రజా అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుకూలంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. శర వేగంగా జరుగుతున్న ఔటర్ రింగ్ రోడ్ ల నిర్మాణం, నగరంలోని రోడ్లకు మరమ్మత్తులు, ఆరోగ్య కేంద్రాలు, పోలీస్ స్టేషన్స్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ అండర్ బ్రిడ్జి, రోడ్ ఓవర్ బ్రిడ్జి, నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా శివారు కాలనీ లన్నింటికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. గత ప్రభుత్వ పాలనలో శిలాఫలకాలతోనే ఐదేళ్లు వెళ్లదీశారని మంత్రి విమర్శించారు. కానీ మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆశించిన దానికంటే మెరుగ్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయం ప్రజలు గుర్తించి ప్రబుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.
ప్రజాసంక్షేమం అభివృద్ధికి సంబందించిన ప్రతిపాదనలను గవర్నర్ లు చైర్మన్ ద్వారా మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎంపిక కాబడిన గవర్నర్ లకు డైరెక్టర్ లు, సభ్యులు సహకరించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడెమి చైర్మన్ నదీమ్ అహ్మద్, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్య లక్ష్మి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అసిఫ్, ఎమ్మేల్సీ అభ్యర్థి ఎండీ. రుహుల్లా, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *