విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ ద్వారా ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ అందుకున్న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. గురువారం రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. వైద్య వృత్తిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు. నాగేశ్వర్ రెడ్డి సాధించిన ఈ ఘనతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …