సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలి…

-నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విధి నిర్వహణలో ఉన్న సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా చూడాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించు సిబ్బందిపై చర్యలు తప్పవని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ భారతీనగర్, శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతములో గల 7 మరియు 8 వార్డ్ సచివాలయ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖి నిర్వహించారు. ఆయా సచివాలయలను పర్యవేక్షించి సిబ్బంది యొక్క వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, మూవ్మెంట్ రిజిస్టర్, పెన్షన్ వివరాలు, ప్రజల నుండి వచ్చిన అర్జిలను నమోదు చేయు రికార్డ్ లు సక్రమముగా నిర్వహిస్తున్నది లేనిది పరిశీలించారు. ఈ సందర్భంలో వార్డ్ సచివాలయం నందు విధిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పధకముల యొక్క పోస్టర్స్ మరియు అర్హుల జాభితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తూ, క్షేత్ర స్థాయి సిబ్బంది భాద్యతగా వారికీ కేటాయించిన విధులను నిర్వహించి ప్రజలకు సంక్షేమ పథకములపై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *