-అధికారులకు పలు సూచనలు – కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గురువారం 4 వ డివిజన్ నందలి లయోలా గార్డెన్స్ పార్క్ మరియు కాలనీ నందలి పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లయోలా గార్డెన్స్ పార్క్ ను సందర్శించిన సందర్బంలో స్థానిక కాలనీ వాసులు పార్క్ ప్రక్కన గల ఖాళి స్థలము నందు స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా రీడింగ్ రూమ్ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ గారికి వివరిస్తూ, స్థానిక కాలనీ వాసులు కాంట్రిబ్యూషన్ అందించుటకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ సందర్బంలో అధికారులతో కలసి సదరు ప్రదేశాన్ని పరిశీలించి రీడింగ్ రూమ్ మరియు జిమ్ ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
తదుపరి సదరు కాలనీ నందలి పలు వీధులు పల్లంగా ఉండుట వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటుందని, రోడ్ అభివృద్ధి పరచాలని కాలనీ వాసులు కోరిన దానిపై పల్లంగా ఉన్న రెండు రోడ్లు వేయుటకు అవసరమైన అంచనాలు తయారు చేసి, రోడ్ వేయుటకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంలో ఆయా రోడ్లలో పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించారు.
పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సిటి ప్లానర్ బాలాజీ మరియు ఇతర క్షేత్ర స్థాయిలో సిబ్బంది మరియు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.