విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రేజరి కార్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తూ ఇటీవల మరణించిన లక్ష్మణ్ కుటుంబాన్ని ట్రెజరీ ఉద్యోగులు పరామర్శించి 70 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇబ్రహీం పట్నం లోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో ప్రైవేట్ వాహనం (అద్దె పద్ధతిపై) డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ (23 సంవత్సరాలు) డిసెంబర్ 24 న గుండె పోటుతో ఆకస్మికంగా మరణించడం పట్ల ఉద్యోగులు తమ సంతాపాన్ని తెలియజేసారు. ఈ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయాన్ని అందించేలా ప్రయత్నిస్తామన్నారు. లక్ష్మణ్ తల్లికి, వారి కుటుంబ సబ్యులకు ఉద్యోగులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రూ. 70 వేలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పే అండ్ అకౌంట్స్ అధికారి కే. పద్మజ, కే. లలిత, ఎమ్. వెంకటేశ్వర రెడ్డి, సహాయ అధికారులు సి.వి. రమణ, వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. శివ ప్రసాద్ మరియు మాల్యాద్రి తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …