బాలికా సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : జేసీ ఎల్. శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బాలికా సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. బేటీ బచావో.. బేటీ పడావో .. కార్యక్రమం అమలుపై ఏర్పాటైన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ శివశంకర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధకము, బాలికలను లైంగిక వేధింపులనుండి రక్షించుట, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణ , దిశ చట్టముల గురించి గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో .. కార్యక్రమం అమలుకు జిల్లా నోడల్ ఆఫీసర్ గా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉప పధక సంచాలకులు వ్యవహరిస్తారన్నారు. బాలికలకు చట్టంలో వారికి కల్పించిన హక్కులను , గ్రామ, మండల స్థాయిలలో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాలికలను ఉన్నత విద్య పట్ల ప్రోత్సహించేందుకు తల్లి తండ్రులలో మార్పు తీసుకువచ్చే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా లీగల్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. బాలికా సంరక్షణ చట్టం, బాలల హక్కులపై ప్రతీ పాఠశాలలోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. బాలికల జనన రేటు నిష్పత్తిని మరింత పెంచే విధంగా గ్రామ స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి నిమిత్తం వచ్చే మహిళలకు సమాజంలో బాలికల ప్రాముఖ్యతను తెలియజేసి విధంగా వివిధ రంగాలలో పేరుపొందిన మహిళల వివరాలు తెలియజేసి విధంగా ముద్రించిన హ్యాండ్ బుక్ లను పంపిణీ చేయాలని జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను జేసీ ఆదేశించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జనవరి, 24వ తేదీన , జాతీయ మహిళా దినోత్సవాన్ని మర్చి, 8వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. బేటీ బచావో.. బేటీ పడావో .. కార్యక్రమం అమలుపై చేపట్టే కార్యక్రమాలపై వార్షిక ప్రణాళికను రూపొందించాలని అధికారులను జేసీ శివశంకర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజారామ్ , విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి చంద్ ,
డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత, ఏ సి పీ వివి నాయుడు, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమారాణి, జిల్లా విద్యాశాఖాధికారి తాహెర్ సుల్తాన, జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ పి . డి. ఆంజనేయరెడ్డి, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *