విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం నందలి బబ్బురి గ్రౌండ్ ను శుక్రవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పర్యటించి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా రూపొందించిన డిజైన్ లను పరిశీలించారు. ఈ సందర్బంలో నగర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రివర్ ఫ్రంట్ అభివృద్ధి లో భాగంగా పున్నమి ఘాట్ నందు సుమారు రూ. 20 లక్షల అంచనాలతో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట పరికరాల ఏర్పాటు మరియు గ్రీనరి అభివృద్ధి పనులకు అంచనాలను తయారు చేయడం జరిగిందని వివరించారు. ముందుగా ఒన్ టౌన్ పశ్చిమ రైల్వే స్టేషన్ ప్రాంతములోని (ముసాఫర్ ఖానా) షాదీ ఖానా నిర్మాణ పనులను పరిశీలించి జరుగుతున్న పనులు వేగవంతము చేసి త్వరితగతిన పూర్తి చేయునట్లుగా చూడాలని మరియు ఇంకను చేపట్ట వలసిన పనులను కూడా సత్వరమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్ రావు, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్ మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …