పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది…

-రూ. .37 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామరాజ్యనగర్ గొల్లపల్లి నాగేశ్వరావు (GNR) నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో (కొండ బడి) సమగ్ర శిక్షా, విద్యాశాఖ రూ.37లక్షల అంచనాలతో నిర్మించిన నూతన భవనము మరియు తరగతి గదులను శుక్రవారం దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ మరియు స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తో కలసి ప్రారంభించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విద్యాలయాల్లో వసతులను మెరుగుపరిచి విద్యార్థులకు చక్కటి విద్యను అందజేసేందుకు జగనన్న ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం జగనన్న ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని అన్నారు. అమ్మ ఒడి పథకం, జగనన్న విద్య దీవెన, జగనన్న గోరుముద్ద వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్  ప్రభుత్వం విద్యకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా మొదటి పేస్ లో రూ 4400 కోట్లు స్కూల్స్ ఆధునీకరించుట జరిగిందని, రెండవ విడతగా మరిని పాఠశాలలో విద్యార్ధులకు మౌలిక వసతులను మేరుగుపరచుట జరుగుతుందని అన్నారు,
అదే విధంగా నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి మాట్లడుతూ కొండబడి అని పిలువబడే గొల్లపల్లి నాగేశ్వరావు నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలోని తరగతి గదులు గతములో పూర్తిగా శిధిలమైన ఉన్నవని, వాటి స్థానంలో నాలుగు తరగతి గదులను సమగ్ర శిక్ష అభియాన్ వారి ద్వారా అధునాతనంగా ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా నిర్మించటం జరిగింది అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నీసా, నగరపాలకసంస్థ ఉపవిద్యాశాఖాధికారి కె.వి.ఆర్.ఆర్.రాజు, విజయవాడ అర్బన్ ఉపవిద్యాశాఖాధికారి కొండా రవికుమార్, పాఠశాలల సూపర్ వైజర్ షేక్ సైదా సాహెబ్, మహమ్మద్ ఉస్సేన్, అసిస్టెంట్ ఇంజనీర్ సమగ్ర శిక్షా పి. గంగరాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మి నరసమ్మ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *