విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైవింగ్ పట్ల నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా రోడ్డు నిబంధనల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మోటార్ వాహన తనిఖీ అధికారి టివిఎన్ సుబ్బారావు అన్నారు.
స్థానిక కంచికచర్ల నేషనల్ హైవే లోని శ్రీఅన్నపూర్ణ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ నందు శుక్రవారంనాడు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులతో డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి టీవీఎన్ సుబ్బారావు మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరమని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చాన్నారు. భారీ వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు వహిస్తూ నిబంధనల ప్రకారమే వాహనాలను నడపాలని, అధిక స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి చేయరాదన్నారు. రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు ఇరువైపులా గమనించుకుంటూ నడవాలన్నారు. డ్రైవర్లు డ్యూటీ ఎక్కేముందే వాహనాలకు సంబంధించినవన్ని సరిగా ఉన్నాయో లేవో తనిఖీ చేసుకొని డ్యూటీ ఎక్కలన్నారు. వాహనానికి సంబంధించిన రికార్డులన్నీ వ్యాలిడిటీ లో ఉండేలా చేసుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అటువంటి సమయాలలో ఒకరికొకరు సహాయకులుగా నిలిచి ప్రమాదాలకు గురైన వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చలన్నారు. డ్రైవింగ్ చేసే సమయాలలో నిర్లక్ష్యం వహించి వద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి అయేషా ఉష్మని, డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యం బి నారాయణరావు, జి గోపి చంద్, ప్రిన్సిపాల్ ఏ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్.రామారావు,సిబ్బంది మరియు శిక్షణ పొందుతున్న డ్రైవర్లు ఉన్నారు.