విజయవాడ రూరల్ జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ గా గండ్రాల రత్నకుమార్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్టృ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు శుక్రవారం విజయవాడ రూరల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆధ్వర్యములో రాష్టృ లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం అధ్యక్షతన విజయవాడ రూరల్ జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ గా గండ్రాల రత్నకుమార్ ను నియమించడం జరిగిందనీ..

రాష్టృ లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ.. మొన్న పంజాబ్ రాష్టృంలో జరిగిన సన్నివేశాన్ని మోడీ రాజకీయం చేశారనీ, అసలు జనం లేని సభకు వెళ్ళకుండా తప్పించుకోవడానికే దళిత ముఖ్యమంత్రిపై ఆక్కస్సుతో ప్రధాన మంత్రి కాన్వాయ్ ఆపించారనీ విషప్రచారం చేశారనీ..

ప్రధాని నరేంద్ర మోడీ 52 రెండించుల ఛాతీ పంజాబ్ రైతుల చప్పట్లకే ఆగిపోయిందనీ, నరేంద్ర మోడీ మాటలన్ని ఉత్తర కుమార ప్రగల్బాలేనని నిరూపితమైనవనీ, బిజెపికీ నరేంద్ర మోడీకి రాజకీయ పతనం పంజాబ్ నుండి మొదలైందనీ, ప్రధాన మంత్రికి దేశంలో ఎప్పుడూ లేనిది మోడీ చవిచూశారనీ, ఈ సిగ్గుమాలిన పరాభవానికి ఈపాటికి నరేంద్ర మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేసి గౌరవం పొందాల్సి పోయి ఇంకా పదవిని పట్టుకోని వేలాడడం రాజకీయ విలువలను తుంగలో తొక్కినట్లు వున్నాయన్నారు.

విజయవాడ రూరల్ జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ గా నియమించబడిన గండ్రాల రత్నకుమార్ మాట్లాడుతూ.. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, విజయవాడ రూరల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్, రాష్టృ లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధం గారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తనకి కల్పించిన ఈ సదావకాశాన్ని తన శక్తి కొలది పార్టీకి, లీగల్ సెల్ కు శ్రమిస్తాననీ తెలిపినారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రాజు, కార్యదర్శి పోతురాజు దాసు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల జయరాజు, ఎన్.యస్.యు.ఐ. రాష్టృ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ ఛైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *