Breaking News

మంచి ఓటు వేద్దాం… అది మంచి వ్యక్తికి వేద్దాం… : గాంధీ నాగరాజన్‌


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ దీక్ష తో గాంధీ యాత్రని ప్రారంభించి 100వ రోజు సందర్భంగా గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు/అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ సభ్యులతో కలిసి మహాత్మా గాంధీజీ, డా, భీమ్‌రావ్‌ రామ్‌ జి, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివారం ఊర్మిళానగర్‌, గాంధీ ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా గాంధీ నాగరాజన్‌ మాట్లాడుతూ గాంధీ, అంబేద్కర్‌లు కుటుంబాలను, కన్న బిడ్డలను సైతం దూరం చేసుకుని దేశంలో ఎన్నో కుటుంబాలను, ఎందరో బిడ్డలను వారి మనుగడకై, వారి ఎదుగుదలకై తమ జీవితాలను మొత్తం దేశ సేవకు అంకితమిచ్చిన మహనీయులు గాంధీ, అంబేద్కర్లని అన్నారు. వారు ఈ దేశానికి మాత్రమే గొప్ప ఆదర్శవంతులు కారు, ప్రపంచానికే ఆదర్శప్రాయులు అని అన్నారు. గాంధీ దీక్షతో కూడిన గాంధీ యాత్ర 100వ రోజు సందర్భముగా గాంధీ నాగరాజన్‌ అనుచరులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి ఓటు యొక్క ప్రాముఖ్యాన్ని గాంధీ చెప్పిన విధానాన్ని ప్రజలకు చెప్పి ఓటు విలువను ప్రజలకు తెలియజేశారు. నేను ఓటు అడగడానికి రాలేదని ఓటు ప్రాముఖ్యతను చెప్పటానికి వచ్చానని వివరిస్తూ ‘‘స్త్రీ రక్షణ లేని స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానే కాదు, రైతు క్షేమమే దేశ క్షేమం, బాలల భవిష్యత్తే భావితరాల భవిష్యత్‌, యువత మేల్కొలుపే భావితరాల మేలుకొలుపు’’ అని అన్నారు. ఇవన్నీ సాధ్యం అయినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అర్ధం అని, ఆనాడు మహాత్మాగాంధీ మంచి ఓటు మనం వేద్దాం అది మంచి వ్యక్తులకే వేద్దాం అని 1920లో చెప్పారని, అలాగే అంబేద్కర్‌ ఓటు గురించి.. భారత రాజ్యాంగం ఒక మహత్తర ఆయుధాన్ని ప్రతి పౌరుడి ఇచ్చిందని అదే ఓటు అని.. దానిని అమ్ముకుని బానిసలా బ్రతుకుతావో లేక మంచిగా ఉపయోగించి రాజుల బ్రతుకుతావో అని ప్రజలకు తెలియపరిచారు. మంచి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఎదిగి దేశానికి ఏవిధమైన మంచి చేయలేడని అందుకే మంచి ఓటు వేద్దాం… అది మంచి వ్యక్తికి వేద్దాం… అన్నారు. పార్టీ, పార్టీ గుర్తులకు ఓటు వేయడం వలన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేకపోతున్నాం కనుక వ్యక్తికి, వ్యక్తిత్వానికి ఓటు వేసే కాలం రావాలని అప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందగలమని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ కార్తీ, బి.భారతి, కె.సౌజన్య, ఎం.శ్రీదేవి, ఆర్‌.అపర్ణ, డి.ప్రణవ్‌ జైసూర్య, వి.రమేష్‌, ఎల్‌.శ్రీను ట్రస్ట్‌ సేవకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *