విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపీకాప్స్) సంస్ధ ఆధ్వర్యంలో తేదీ.08-01-2022, శనివారంనాడు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విజయవాడ, బీసెంట్ రోడ్, ఎల్ ఐ సి బిల్డింగ్ ఎదురుగా గూడవల్లి వారి వీధిలో అశోక ట్రేడర్స్ ఎదురుగా వున్న ఇంపీకాప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు చర్మ వ్యాధులపై ఉచిత ఆయుర్వేద శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సోరియాసిస్, గజ్జి, తామర,బొల్లి, మచ్చలు, మొటిమలు మొదలగు వాటికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చే వైద్య పరీక్షలు చేసి అవసరం మేర ఆయుర్వేద మందులు ఉచితం గా ప్రజలకు ఇవ్వబడింది. ఈ వైద్య శిబిరంలో డైరెక్టర్, ఇంపీకాప్స్ డాక్టర్ వేముల భాను ప్రకాష్, డాక్టర్ పమ్మి సూర్యకుమార్, డాక్టర్ గణేసన్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ ఆదర్శ్ లు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో 178 మంది ప్రజలు పాల్గొన్నారు.