విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ నందు పర్యటించి సంక్షేమ పథకాల అమలు తీరును,సమస్యలను స్థానిక పెద్దలు, ప్రజలను తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అవినాష్ మాట్లాడుతూ జాస్తి వారి వీధి నందు సైడ్ డ్రైన్, మసీదు సందు నందు కల్వర్టర్ మరియు పటమటలంక మెయిన్ రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు సమస్యలు ను పరివేక్షించి వి.ఎమ్.సి కమిషనర్ తో మాట్లాడి వీలు అయినంత త్వరగా నిధులు మంజూరు చెపిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.అదేవిధంగా పటమటలంక స్క్రూ బ్రిడ్జి రోడ్డులో నివసిస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వటమే కాకుండా సొంత ఇల్లులు వీలు అయినంత త్వరాగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా మరియు శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే ఈ డివిజిన్ లో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, మరో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని తెలిపారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ లు టీడీపీ వారే అయ్యుండి కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి గురుంచి పట్టించుకోలేదని ఎద్దేవాచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేస్తున్నామని,టీడీపీ లాగా ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు, కృష్ణాజిల్లా మత్స్యకార శాఖ సొసైటీ డైరెక్టర్ ఖాళీ,ముక్కు వెంకటేశ్వర రెడ్డి,రామాయణపు శ్రీనివాస్,ఉకోటి రమేష్, గద్దె కళ్యాణ్,నాగరాజు,శెటికం దుర్గా ప్రసాద్,కోలా ఉమ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …