-అర్జీదారుల సంతృప్తే లక్ష్యం, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, సోమవారం అధికారులతో కలిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించి, వారి యొక్క సమస్యల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అర్జీదారుని సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను ఇబ్బందులను పరిశీలించి సమస్యతో వచ్చిన ఫిర్యాదు ధరునికి భరోసా కల్పించేలా పరిష్కారించాలని ఆదేశించారు. వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 21 అర్జీలు అందుకున్నారు. కాగా నేటి స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగం – 5, పట్టణ ప్రణాళిక విభాగం – 3, పబ్లిక్ హెల్త్ విభాగం –5, రెవెన్యూ విభాగం – 2, యు.సి.డి విభాగం – 5, ఎ.డి.హెచ్ విభాగం – 1 మొత్తం 21 అర్జీలు స్వీకరించుట జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 2 అర్జీలు…
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో 2 అర్జీలు, యు.సి.డి విభాగం -1, రెవిన్యూ విభాగం – 1, సర్కిల్ – 1 మరియు సర్కిల్ – 3 కార్యాలయలలో ఏవిధమైన అర్జీ వచ్చియుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.