పార్క్ ల నిర్వహణకై కాలనీల అసోసియేషన్ వారు భాగస్వామ్యులు కావాలి…

-నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ చే వివిధ ప్రదేశాలలో మరియు కాలనీ లలో ఆధునీకరించిన పార్క్ ల నిర్వహణ కు సంబందించి నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు నగర పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యెక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,  అవుతు శ్రీశైలజ మరియు పలు కాలనీ ల ప్రెసిడెంట్ / సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అనేక పార్క్ లను స్థానికంగా ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు చేయుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలతో ఆహ్లాదకరంగా అభివృద్ధి పరచినట్లుగా కమిషనర్ వివరించారు. స్థానికంగా ఉన్న కాలనీ వాసులు లేదా అసోసియేషన్ వారు ముందుకు వచ్చి ఆయా పార్క్ ల నిర్వహణ భాద్యతలను తీసుకున్నట్లయితే ఎల్లవేళల పార్కు ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. పార్క్ ల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి అగు ఖర్చు నగరపాలక సంస్థ నుండి 60 శాతం చెల్లించుట జరుగుతుందని, మిగిలిన 40 శాతం పార్క్ అసోసియేషన్ వారు చెల్లించాలని వివరించారు.

ఈ ప్రక్రియలో గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణలోనికి తీసుకోని ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవటం జరిగిందని, అసోసియేషన్ వారు సిబ్బంది యొక్క వేతనములను నేరుగా తప్పనిసరిగా వారి ఎకౌంటు ద్వారా చెల్లించి వాటి వివరాలు రికార్డ్ చేయాలని, నగరపాలక సంస్థ ద్వారా చెల్లించవలసిన మొత్తం అసోసియేషన్ కామన్ ఎకౌంటుకు ఆన్ లైన్ ద్వారా జమ చేయుట జరుగుతుందని వివరించారు. కాలనీ వారితో సమావేశమై మీ యొక్క ఆమోదం విధిగా ఫెబ్రవరి 15 తేది లోపుగా లేదా ఇంకా ముందుగానైన తెలియజేయవలసినదిగా తెలియజేసారు. పార్క్ ల నిర్వహణ విషయంలో కాలనీ అసోసియేషన్ వారు అనుకూల దృక్పధం కలిగి ఉండాలని కోరినారు.

సమావేశంలో వివిధ కాలనీ వాసుల వారికి ఎదురైన సమస్యలు మరియు వారి సలహాలను కమిషనర్ గారికి వివరించగా వాటికీ సమాదానం తెలియజేస్తూ, నగర అభివృద్ధి దృష్ట్యా కాలనీ వాసులు నగరపాలక సంస్థ తో కలసి పని చేసి నగరాన్ని సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దుటలో సహకారాన్ని అందించాలని సూచించారు.

సదరు సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ సి.హెచ్ శ్రీనివాసులు , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు పలు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *