అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రభుత్వ శెలవు దినాలలో స్వల్పమార్పులు చేస్తూ జి.ఓ.ఆర్టి.నెం.58 ను నేడు జారీచేసింది. ఈ మార్పుల్లో భాగంగా ఈ నెల 13 గురువారాన్ని ప్రభుత్వ శెలవు దినంగా ప్రకటించింది. మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గతంలో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 14, 15 మరియు 16 తేదీలను వరుసగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమగా ప్రకటించింది. అయితే ఈ తేదీలకు బదులుగా జనవరి 13, 14 మరియు 15 తేదీలను వరుసగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమగా ఖరారు చేస్తూ ప్రభుత్వ శెలవు దినాలుగా ప్రకటించింది.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …