విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ లో పనిచేయుచున్న 10 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు LFL Head Master మరియు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయుచూ ఉత్తర్వులను మేయర్ రాయన భాగ్య లక్ష్మి చేతుల మీదుగా ఇచ్చుట జరిగినది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పిల్లల చదువులపై ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి గ్రేడులు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ కోరుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులపై శుభాకాంక్షలు తెలిపారు మరియు ఈ సందర్భంగా విద్యా వాలంటీర్లను ఇచ్చినందుకు మరియు పదోన్నతులు ఇచ్చినందుకు గాను మేయర్ రాయన భాగ్య లక్ష్మి కి, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా బేగం కి, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ కి, అదనపు కమీషనర్ జె. అరుణ కి ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి శ్రీ KVRR రాజు, స్కూల్ సూపర్వైజర్ హుస్సేన్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …