-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహావేదాంతి, ఉపన్యాసకర్త, విశ్వశాంతి కాముకుడు వివేకానందుని జన్మదిన సందర్భముగా నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ M.G.రోడ్డు రాఘవయ్య పార్కు నందలి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఆయినా నీతి బోధనలు స్మరించుకొన్నారు. సంకల్ప బలం ఉంటే చాలు దైవ బలం తోడు అగునని ధృడ సంకల్పంతో కొండలను పిండి చేయగల సత్తా యువతకు కలదని యువతలో స్పూర్తి నింపిన గొప్ప దార్శనికుడు వివేకానందుడని కొనియాడిరి. చికాగో నగరంలోని సర్వమత సమ్మేళనంలో ఆయన ఉపన్యాసం భారతీయుల ఆధ్యాత్మికచింతన సంస్కృతీ సాంప్రదాయములను ఆచంద్రతారార్కం గుర్తుండే విధంగా చేసిందని శ్లాఘించారు. వివేకానందుని వంటి మహాపురుషుని గురుచర్యంతో నేటి యువత ఆయన ప్రబోధనలను ఆదర్సంగా తీసుకొని మంచి నడవడికతో విజయతీరాలను చేరి బంగారు భవిష్యత్ కలిగి ఉండాలని ఆకాక్షించారు. అనంతరం రాఘవయ్య పార్క్ ను తనిఖి చేసి అధికారులకు పలు సూచనలు చేసినారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, EOA అశోక్ మౌర్య, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.