రియ‌ల్‌మీ ఎక్స్‌పీరియ‌న్స్ స్టోర్ ప్రారంభం…

 


విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో కూడిన సెల్‌ఫోన్ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి తీసుకొస్తూ న‌గ‌రంలో రియ‌ల్‌మీ ఎక్స్‌పీరియ‌న్స్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అన్నారు. విజ‌య‌వాడ ఏలూరు రోడ్డులో ఏర్పాటు చేసిన రియల్‌మీ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా స్టోర్ ఎండీ ఎం.ఆర్‌.సుతీంద‌ర్ సింగ్‌, కంపెనీ జెడ్‌.ఎస్‌.ఎం ప్ర‌వీణ్ అస్త‌గి (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌)లు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో కూడా రియ‌ల్‌మీ ఎక్స్‌పీరియ‌న్స్ స్టోర్ ఉంద‌ని తెలిపారు. రియ‌ల్‌మీ మొబైల్ ఫోన్ల‌కు యువ‌త నుంచి మంచి డిమాండ్ ఉంద‌ని చెప్పారు. స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో పాటు సంక్రాంతి పండ‌గ నేప‌ధ్యంలో ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను అందుబాటులో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో కంపెనీ ఏబీఎం కె.నాగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు. స్టోర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు విచ్చేసి నిర్వాహ‌కుల‌ను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *