దేశ అభివృద్ధిలో యువతపాత్ర ఎంతో కీలకం .. బి జె ప్రసన్న, రాష్ట్ర సంచాలకులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు యానాం


గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ అభివృద్ధిలో యువతపాత్ర ఎంతో కీలకం అని  బి జె ప్రసన్న, రాష్ట్ర సంచాలకులు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం అని అన్నారు, భారత ప్రభుత్వము కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వశాఖ నెహ్రూ యువకేంద్ర గుంటూరు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు  బి జె ప్రసన్న  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో నుంచి వర్చువల్ గా పుదుచ్చేరిలో 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన యువజన సంఘాలు మరియు యువత తో కలసి వీక్షించారు. ఆ కార్యక్రమంలో మన దేశ ప్రధానమంత్రి  నరేంద్రమోడీ  దేశ యువతను ఉద్దేశించి మాట్లాడిన మాటలను యువత పాటించి దేశ అభివృద్ధి కి పాటుపడాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  చెప్పినట్లుగా భారతదేశ యువత ప్రపంచ శ్రేయస్సు కోసం కోడ్‌ను రచిస్తున్నారు అని అన్నారు అలాగే ‘వోకల్ ఫర్ లోకల్’ మిషన్‌కు కట్టుబడి ఉండాలని ఇది ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నెహ్రూ యువ కేంద్రం సఘటన్ దేశంలో యువత ను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతోందని ప్రతి ఒక్క యువత ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ వి డి ఎస్ రామకృష్ణ  మాట్లాడుతూ స్వామి వివేకానంద భావాలను యువత అలవర్చుకోవాలని, యువత లో నైపుణ్యతే దేశ అభివృద్ధి కి మొదటి అడుగు అని , యువత గ్రామాలలో యువజన సంఘాలు గా ఏర్పడి గ్రామాభివృద్ధికి అవసరమయ్యే కార్యక్రమాలు చేపట్టాలి అని అన్నారు. తరువాత గుంటూరు స్టెప్ సి ఈ ఓ డా. శ్రీనివాసరావు  మాట్లాడుతూ స్వామి వివేకానంద భగవంతుని స్వరూపం అని అలాగే యూత్ ఐకాన్ అని పేర్కొన్నారు స్వామి వివేకానంద జీవిత చరిత్ర యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అని తెలియజేశారు వివేకానంద ఉపన్యాసాలు సందేశాలు యువతకు ఎంతో మార్గదర్శకంగా అని తెలియజేశారు భగవంతుడు ప్రతి వ్యక్తిలో అనంతమైన శక్తిని దాచి ఉంచారని కాబట్టి ప్రతి వ్యక్తి తన శక్తిని గ్రహించాలని తనపై తనకు గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని అందరూ కూడా డా తమ శక్తిని సమాజ శ్రేయస్సుకు దేశ అభివృద్ధికి వినియోగించాలని అదే వివేకానంద తెలియజేశారని తెలిపారు అతిధులచే జిల్లా స్థాయిలో వివిధ భాగాలలో ప్రతిభ కనపరిచిన యువకులకు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్టెప్ అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్స్ మేనేజర్  పి రామచంద్ర రావు మరియు నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువజన అధికారి కుమారి దేవి రెడ్డి కిరణ్మయి  ఇతర అతిధులుగా పాల్గొనగా గ్రామ మరియు పట్టణ ప్రాంతాలనుంచి యువజన సంఘాలు మరియు యువత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *