విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ 40వ డివిజన్ అధ్యక్షులు , ఐజా గ్రూప్ చైర్మన్,రజా కమిటీ ప్రెసిడెంట్ షేక్. గయసుద్దిన్ ఆధ్వర్యంలో 2000 పేద సామాన్య కుటుంబాలకు 11 రకాల తో కూడిన నిత్యావసర సరుకుల సంక్రాంతి కానుక కిట్స్ పంపిణీ కార్యక్రమం భవాని హాస్పిటల్ రోడ్డు నాగార్జున వీధి భవానిపురం లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద సామాన్య వర్గాలు రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి పండుగలను ఆనందంతో చేసుకోవాలని మంచి మనసుతో గయసుద్దీన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని ఓటమి తర్వాత కూడా ప్రజలకు నిత్యం సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గయసుద్దీన్ ఉన్నతమైన మనసును తెలియజేస్తుందని, ప్రస్తుత సమాజంలో లబ్ధి పొందేందుకు కులం మతం అంటూ ప్రజలను విడదీస్తూనటువంటి వారిని చెప్పుతీసి కొట్టాలని, భగవంతుడు గయసుద్దిన్ కు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఉన్నతంగా ఎదిగేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద సామాన్య ప్రజల పండగ చేసుకునే వాతావరణం లేదని నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పెరిగిన ధరలను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆనందంతోలేరని ఉపాధి ఉద్యోగాల్లేక చేతిలో డబ్బులు లేక కనీసం జత బట్టలు కొనుక్కునే మరియు కేజీ పిండి వంటలు వండుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే జగన్ గారి పాలన ఎంత దారుణంగా ఉందో ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అన్నారు. టిడ్కో ఇళ్లను తక్షణమే నిర్మాణం పూర్తి చేసి పేద సామాన్య ప్రజలకు అందజేయాలని, సెంటు భూమి విజయవాడ నగర ప్రజలకు అడవుల్లో అందజేశారని వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదని, అదే విధంగా పేద ప్రజలు పండగ చేసుకోవడానికి రెండు వేల రూపాయలు చేతులు లేక అల్లాడుతుంటే వన్టైమ్ సెటిల్మెంట్ పథకం కింద 20 వేల రూపాయలు ఏ విధంగా ఇస్తారు వైఎస్సార్ సీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు ఈ అన్ని అంశాలపై అతి తొందర్లోనే జనసేన పార్టీ విజయవాడ తరఫున పేదల పక్షాన న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు.
షేక్ . గయసుద్దిన్ మాట్లాడుతూ పేద సామాన్య వర్గాలు ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని 40వ డివిజన్ లో 2000 మందికి ఐజా గ్రూప్ తరపున 11 రకాల నిత్యావసర సరుకుల కిట్ ను సంక్రాంతి కానుక పంపిణీ చేస్తున్నామని, సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకు పోతిన మహేష్ గారు సూచించిన విధంగా పోరాడుతామని ప్రజలకు అండగా నిలబడతామని అధికారపార్టీ అరాచకాలను ఎండగడతాం అన్నారు. నాకు అండగా నిలబడుతున్న కుటుంబ సభ్యులకు ,సోదరులకు, అక్కాచెల్లెళ్లకు ,స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు పేద సామాన్య వర్గాల కోసం చేస్తామని భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ .మున్న , షేక్. గౌసియా, వీర రెడ్డి, D.దుర్గారావు, నాగార్జున, తాజ్ నొత్. మైనర్ బాబు, స్టాలిన్ శంకర్, 41 వ డివిజన్ అధ్యక్షులు కూరాకుల సురేష్,38 డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలాకరుణాకర్,48 వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి. రమణ,53 డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, జనసేన పార్టీ నగర సహాయ కార్యదర్శి గన్ను. శంకర్, బావిశెట్టి శ్రీను,పొలిశెట్టి.శివ,పోతిన .అదిత్, మదన్, రాజు,సాయి, ముంతపురం.రాజేష్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు