-నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరు సంతోషంగా జరుపుకొనే ప్రధాన పండుగ సంక్రాంతి అని దేశ విదేశాలలో నివసించే తెలుగు వారు అత్యంత మక్కువ చూపించే పండుగ సంక్రాంతి అని ఈ సందర్భముగా ప్రతి ఒక్కరూ భోగ భాగ్యములతో ఆయురారోగ్యములతో సిరి సంపదలతో సుఖమయ జీవితం గడపాలని సంస్కృతీ సాంప్రదాయములకు పెద్దపీట వేస్తూ గౌరవమన్ననలతో చిన్నారులు, పెద్దలు కలిసి వేసే భోగి మంటలతో గాలిపటాల సందడి తో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.