కోవిడ్ కేర్ సెంటర్లను అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ కేర్ సెంటర్లను అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ గూడవల్లి లో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను గురువారం జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటాన్ని దృష్ఠిలో పెట్టుకొని అన్ని రకాల వైద్య, మౌళిక వసతులతో కేర్ సెంటర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన మరుగుదొడ్లు సిద్దం చేయాలని,మూడు షిఫ్ట్ లలో డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉండాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని అదేశించారు. వంద పడకల కేర్ సెంటర్ లను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లోని మండలాల్లో ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కేర్ సెంటర్లలోని బెడ్స్ లపై కొత్త బెడ్ షీట్స్ ఉంచాలని, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్ ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాట్లలకు అత్యవసరంగా లక్ష రూపాయలు నిధులను మంజూరు చేశామని అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్ శివ శంకర్ అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకునే రోగుల నుండి ఎటువంటి ఫిర్యాదులు, విమర్శలు రానీయకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లతో కోవిడ్ కేర్ సెంటర్లు సిద్ధంగా ఉంచాలని జాయింట్ కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *