విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం నుంచి పల్లకి సేవపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ పూజ కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముక్కోటి ఏకాదశి నాడు ద్వార పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలపై వేంకటేశుని చల్లనిచూపు ఎల్లప్పుడూ ఉంటుందని.. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, నేరేళ్ల శివప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …