తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో కనిపించాయి. వేంకటేశ్వరుడిని భక్తులు ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకుని తరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, సిఇ నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, వెల్ఫేర్ డిప్యూటీ ఈఓ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Tags tirumala
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …