Breaking News

దేవాలయాల ప్రతిష్టను, హిందూ ధర్మాన్ని సీఎం వైఎస్ జగన్ పరిరక్షిస్తున్నారు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలన్నీ భోగి మంటలతో అంతం కావాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రజలు భోగి మంటలను వేశారు. గవర్నర్ పేటలో 23వ డివిజన్ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకలను డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావుతో కలిసి మల్లాది విష్ణు ప్రారంభించారు. యువత, మహిళలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ప్రసాదించాలని.. భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకున్నారు. భోగి మంట‌లు కేవలం చ‌లి నుంచి శ‌రీరాన్ని కాపాడుకోవ‌డానికే కాద‌ని, ఇందులో ఆరోగ్య ర‌హ‌స్యం కూడా దాగుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భోగి మంట‌ల్లో ప‌శువుల పేడ‌తో చేసిన పిడ‌క‌ల‌ను వాడ‌టం మ‌న సంప్రదాయ‌మ‌ని, దీని ద్వారా గాలిలో ఆక్సిజ‌న్ శాతం పెరుగుతుంద‌న్నారు. గాలి శుద్ధి అవడంతో పాటుగా సూక్ష్మక్రిములు న‌శిస్తాయ‌ని తెలిపారు. సంక్రాంతి పండుగ మ‌న‌కు ఎన్నో సంబ‌రాలు మోసుకువ‌స్తుంద‌ని, అయితే ఈ సంక్రాంతి మాత్రం మ‌నంద‌రికీ ఎంతో ప్రత్యేక‌మైన‌ద‌ని మల్లాది విష్ణు చెప్పారు. పింఛన్ పెంపు, ఇళ్ల నిర్మాణాలు, ఓటీఎస్, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ వంటి కార్యక్రమాలతో పేద‌, మధ్య తరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న‌న్న రెట్టింపు ఆనందాన్ని నింపార‌ని తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఈ వ‌రాలు చూసి తట్టుకోలేక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలుగా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందుత్వం గూర్చి మాట్లాడే నైతిక అర్హత సోము వీర్రాజుకి లేదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. గత తెలుగుదేశం హయాంలో బీజేపీ నేత మంత్రిగా ఉన్న సమయంలోనే పదుల సంఖ్యలో దేవాలయాలను కూల్చివేశారని.. ఆనాడు మీ సిద్ధాంతాలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాల మొదలు చిన్న ఆలయాల వరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తొలగించిన నాడు సోము వీర్రాజు ఎందుకు నోరు మెదపలేదన్నారు. ఇటీవల జరిగిన ప్రతి ఉపఎన్నికలో ఘోర పరాజయంపాలవటంతో పాటు.. మిత్రపక్షాలు సైతం సహకరించకపోవడంతో బీజేపీ నాయకులకు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదన్నారు. కనుకనే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అన్ని మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు హయాంలో దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా ఉండేది కాదన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలన్నీ ధూపదీప నైవేద్యాలతో, నిత్య కైంకర్యాలతో కళకళలాడుతున్నాయన్నారు. దేవాలయాల ప్రతిష్టను, హిందు ధర్మాన్ని పరిరక్షిస్తూ.. తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మిస్తున్నారని వెల్లడించారు. అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు సైతం కల్పించడం జరిగిందన్నారు. టీటీడీ ప్రవేశపెడుతున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని.. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమమే ఇందుకు చక్కని ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కనుమ పర్వదినం రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో గోమాతకి పూజలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. కనుక మత రాజకీయాలను బీజేపీ విడనాడాలని సూచించారు. మరోవైపు ప్రశాంత రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయాలను ఇకనైనా కట్టిపెట్టాలని.. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ మ‌న లోగిళ్లలో ప్రతి రోజూ సంక్రాంతి ఉంటుంద‌ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 29 వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మిపతి, నాయకులు బంకా భాస్కర్, వెన్నం రత్నారావు, దమ్మాల మల్లిఖార్జున, చల్లా సుధాకర్, పిల్లి కృష్ణవేణి, లక్ష్మి, వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *