సకాలంలో నిపుణుడైన వైద్యుడిని సంప్రదిస్తే మెరుగైన చికిత్స… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శరీరానికి సోకిన ఇతర దీర్ఘ వ్యాధులు, హఠాత్తుగా తలెత్తిన రుగ్మతల వల్ల కిడ్నీలు ప్రమాదం ఎదుర్కొంటాయని, ఈ పరిస్థితిలో తక్షణమే నిపుణుడైన వైద్యుడిని సంప్రదించగలిగితే ఆ వ్యాధులకు మెరుగైన చికిత్స జరిగి మూత్రపిండాలు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ఆయన స్థానిక పోర్టు రోడ్డులోని ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నూతనంగా డాక్టర్ పవన్ కిడ్నీ కేర్ సెంటర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, శరీరంలోని రక్తాన్ని శుద్దిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపించే కిడ్నీలకు వ్యాధులు సోకినప్పుడు ఓ సాధారణ వ్యక్తి దేహంలో ఉండే 4.5 – 5.7 లీటర్ల రక్తాన్నే శుద్ధిచేయలేని స్థితికి చేరుకుంటాయిన్నారు. వ్యక్తి తన మూత్రపిండాలతో సహా మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించటంలో చాలా వరకు ఆలస్యం అవుతుందని, వ్యాధులు ముదిరి క్రమంగా మూత్రవ్యవస్థ పనితీరు దెబ్బదింటుందన్నారు. కొంత మందిలో ఇది చివరకు రీలనల్ ఫెయిల్యూరుకు దారితీసి మూత్ర పిండాల మార్పిడి(కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్) అవసరం అవుతుందని చెప్పారు. మూత్రపిండాల సమస్యలు తలెత్తినపుడు పెద్ద నగరాలు మినహా సాధారణ టౌన్ లలో సరైన చికిత్సలు లభించని దుస్థితి ఉందన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రత్యేకంగా కిడ్నీ కేర్ సెంటర్ ప్రారంభం కావడం ఎంతో అభినందనీయమన్నారు. డాక్టర్ పెరుగు పవన్ కుమార్ , డాక్టర్ బిందు మాధవి వైద్య దంపతులు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం శుభ పరిణామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ ఛైర్మెన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, కృష్ణాజిల్లా అర్బన్ బ్యాంకు మాజీ ఛైర్మెన్ బొర్రా విఠల్, 3 వ డివిజన్ ఇంచార్జ్ శీలం బాబ్జి పలువురు వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *