ఉద్యోగస్తుల పోరాటానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ 13 లక్షల మంది ఉద్యోగస్తుల జీవితాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్  వెన్నుపోటు పొడిచారని, వేతన సవరణ తో జీతాలు పెరుగుతాయని ఎంత ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తుల ఆశలను అడియాశలు చేస్తూ జీతాలు తగ్గించి ఉద్యోగస్తులకు దారుణంగా మోసం చేశారని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత విధానం వల్ల ప్రతి ఉద్యోగస్తునికి రెండు ఇంక్రిమెంట్లు తగ్గి జీతంలో పెద్ద ఎత్తున కోత పడుతుందని, ఇంటి అద్దె పద్యంలో 16 శాతం కోత విధించడం దుర్మార్గమని దీనివల్ల ప్రతి ఉద్యోగస్తునికి సుమారు రెండు వేల నుంచి ఆరువేల రూపాయలు నష్టమని, ఫిట్మెంటు లో ఒక మెలిక పెట్టి బకాయిలను రద్దు చేసి ఉద్యోగస్తులే ఎదురు ఒక్కొక్కరు లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెప్పడం నయవంచన కు గురి చేయడమేనని, సిపిఎస్ రద్దు చేయమంటే సిసిఎస్ నగర నగర భత్యాన్ని రద్దు చేశారని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి రెగ్యులరైజేషన్ చెయ్యకుండా కనీస వేతనం అమలు చేయకుండా రెండున్నర లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగస్తుల మోసం చేశారని, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కనీస జీతం గురించి మాట్లాడకుండా మొండిచేయి చూపించారని, ఈ ప్రభుత్వం ఏడాది 30 వేల మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే 14 వేల కోట్లు రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుందని అవి చెల్లించలేని పరిస్థితిలో పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 పెంచారని, గతంలో రిటైర్మెంట్ అయిన వారికి ఇంతవరకు ఐదు వేల కోట్ల రూపాయల బకాయి చెల్లించలేదని, అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ పై ఉద్యోగస్తులు లోన్స్ పెట్టుకుంటే ఏడాది కాలం నుంచి 2400 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించలేని దుర్భర పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకు ఉందొ సమాధానం చెప్పాలని, లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్స్ పై 5 వేల కోట్ల రూపాయల బకాయిలను ఉద్యోగస్తులకు ప్రభుత్వం చెల్లించలేక పోయిందని, ఇన్ని వేల కోట్ల రూపాయల ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బుని వైయస్ జగన్  ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని, వేతన సవరణ కోసం అసుతోష్ మిశ్రా కమిటీని వైయస్ జగన్ గారి ప్రభుత్వం నియాయమించింది, కానీ ఆ కమిటీ చేసిన సిఫార్సులను ఎందుకు బహిర్గతం చేయడం లేదో సమాధానం చెప్పాలని ,ఈ అంశంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్ని సార్లు ప్రయత్నించినా ప్రభుత్వం లెక్కజేయకుండా cs కమిటీని నియామకం చేసి వారి ఇష్టానుసారం వేతన సవరణపై నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగస్తులను మోసం చేశారని, ప్రజా సంకల్ప యాత్రలో ఉద్యోగస్తులు ఎవరు జగన్ గారిని హామీలు అడగకుండానే వారి ఇష్టానుసారం హామీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా ఉద్యోగస్తులను దోషులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారని సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు చింతామణి నాటకం రద్దు చేశారని, వేతన సవరణ పై పది రోజులు ముందు ముఖ్యమంత్రి గారిని కలిసి చప్పట్లు కొట్టినా ఉద్యోగ సంఘ నాయకులు నేడు ఉద్యోగస్తులు ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో పాల్గొన వలసిన దుస్థితి వచ్చిందని వైయస్ జగన్ గారిని నమ్మి ఉద్యోగ సంఘ నాయకులు మోసపోయారని, ఉద్యోగస్తులే నేడు ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపిస్తున్నారని, ఉద్యోగస్తులు చేసే ఉద్యమానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో నగర ఉపాధ్యక్షులు 1.వెన్న శివశంకర్2. కమల సోమనాథం, నగర కమిటీ సభ్యులు పాల .రజిని ,గన్ని. రాము ,గన్ను .శంకర్ ,రాఖీ గౌడ్, రామకృష్ణ, వివిధ డివిజన్ల అధ్యక్షులు మల్లెపు. విజయలక్ష్మితమ్మినా .లీలా కరుణాకర్ ,రెడ్డిపల్లి .గంగాధర్, ఏలూరు. సాయి శరత్, నల్లబెల్లి .కనకారావు, చిగుళ్ళ. దుర్గాప్రసాద్ ,జి. శ్రీనివాస్ ,పెద్దిరెడ్డి .తిలక్ మరియు బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *