-11వ పిఆర్సి అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం
-ఉద్యోగుల పిఆర్సి తదితర అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
-ఉద్యోగులంతా ప్రభుత్వ బిడ్డలే-ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి కలిగినది ఈప్రభుత్వం
-రాష్ట్ర సమాచాశార,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచిన నిర్ణయం,11వ పేరివిజన్ కమీషన్ అమలు(పిఆర్సి)అమలుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా,సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని)వెల్లడించారు.ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశ నిర్ణయాలను నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో మీడియాకు వివరిస్తూ ఉద్యోగలకు సంబంధించిన పిఆర్సి తదితర అంశాలపై మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆర్ధికపరమైన కష్టాలు,ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే అర్దం చేసుకోండి మానసిక వేదనకు గురై నలిగిపోతూనే ఈప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు.ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి ఉన్న ప్రభుత్వమిదని పేర్కొన్నారు.ఈప్రభుత్వం వచ్చిన నెలలోపే 27శాతం ఐఆర్ ఇచ్చిందని తెలిపారు.ఉద్యోగులకు ఇవ్వాలనుకున్నారు ఐఆర్ ఇచ్చారు ఆరోజు ఐఅర్ ఇచ్చినప్పటి స్థితి ఇప్పుడు లేక ఆర్ధికపరమైన కష్టాలు వల్లే కదా అన్నారు.23 శాతం పిట్మెంట్ ఎందుకు చేశారు ఆర్ధికపరమైన ఇబ్బందులే కదా అని మంత్రి తెలిపారు.మరలా పరిస్థితులు బాగున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం కదా చెప్పారు.ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మాబిడ్డలు,మావాళ్ళుగా ఎప్పటికీ భావిస్తామని గత్యంతరం లేక నలిగిపోతూ ఆర్ధిక పరమైన ఇబ్బందుల వల్లే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామని కావున ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.ఆవేశ పడకుండా సంప్రదింపులకు ముందుకు రావాలని విజ్ణప్తి చేస్తూ మనందరం ప్రేమించే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్యంగా మాట్లాడడం మానసిక ఆనందమే తప్ప మరొకటి కాదని మంత్రి వెంకట్రామయ్య పేర్కొన్నారు.
ఉద్యోగులపట్ల ప్రభుత్వం ఏమాత్రం మొండిగా లేదని కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం రమ్మంటున్నామని చెప్పారు.మనం ప్రేమతో గెలుపించుకున్న గౌరవ ప్రదమైన ప్రజానాయకుడు సియం జగన్మోహన్ రెడ్డిని తిడితే లేదా శాపనార్ధాలు పెడితే హెచ్ఆర్ఏ వచ్చేస్తుందా అసభ్యంగా మాట్లాడడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు.పది మందికి పాఠాలు చెప్పాల్సిన మనం విద్యార్ధులకు మంచి విద్యాబుధ్దులు నేర్పాల్సిన మనం సమాజానికి మంచి పౌరులను తయారు చేయాల్సిన మనం అసభ్యంగా సియం గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రత్యేకంగా ఉపాధ్యాయ సంఘాలను మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రశ్నించారు.సంప్రదింపులు ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఈప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా తలుపులు తెరిచి ఉందని స్పష్టం చేశారు.సియం జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులకు ఎవరూ తగాదా పెట్టలేరని అన్నారు.రోడ్డు ఎక్కడం ఎందుకు రండి కూర్చుని మాట్లాడుకుందామంటున్నామని చెప్పుడు మాటలు నమ్మవద్దని ఉద్యోగులకు హితవు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఈసమావేశంలో సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.