జగనన్న పాల వెల్లువలో పాల సేకరణ పెంచండి… : కలెక్టర్ జె. నివాస్

-ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ (పాల సేకరణ) కేంద్రాలను పరిశుభ్రం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో మహిళా పాడి రైతుల నుండి సేకరిస్తున్న పాల సేకరణ పెంచాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం పశుసంవర్ధక, అమూల్ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య అధికారులతో జిల్లా కలెక్టర్ జె. నివాస్ నగరంలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా పాడి రైతుల సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించటమే లక్ష్యంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం సేకరిస్తున్న 100గ్రామాలలోని 100 సొసైటీల ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల 17 వేల ఆరు వందల లీటర్లు పాలను సేకరించడం జరిగిందన్నారు. రోజుకు ఆరు వేల ఐదు వందల లీటర్లు చొప్పున పాల సేకరణ ప్రస్తుతం జరుగుతుందన్నారు. వీటితో పాటు మరిన్ని పాల సేకరణ కేంద్రాలను పెంచాలన్నారు. ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్(పాల సేకరణ) కేంద్రాలలో ఉదయం సాయంత్రం క్లీనింగ్ నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.వెన్న శాతం ఆధారంగా లీటర్ కు 75 రూపాయల వరకు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 5వ తేదీ 15వ తేదీ 25 తేదీలలో చెల్లింపులు చేస్తున్నామన్నారు.జిల్లాలో 14,603 మంది పాడి రైతులు నమోదు చేసుకోగా వీరిలో 3,608 మంది మహిళా పాడి రైతులు పాలను పోస్తున్నారని, మిగిలిన వారిని కూడా ప్రోత్సహించాలన్నారు. మహిళా పాడి రైతులకు జగనన్న పాలవెల్లువపై అవగాహన కల్పించి మరింత మంది పాడి రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా ప్రైవేట్ డైరీలకన్నా అధిక ధర, అమూల్ సంస్థ పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలుకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, మంచి పోషకాలతో కూడిన పశువుల దాణా వంటి ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. పశువుల దాన షెడ్ల నిర్మాణానికి వర్కింగ్ క్యాపిటల్ గా 500మంది పాడి రైతులకు కోటి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం, అమూల్ సంస్థ అందించే ప్రోత్సాహకాలపై మహిళా పాడి రైతులకు అవగాహన కల్పించి పాల సేకరణ పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్, సహాయ సంచాలకులు లలిత్ కుమార్, ఏపీ డిడిసిఎఫ్ఎల్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట సిద్ధులు, అమూల్ కంపెనీ జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *