పరిష్కారానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలి… : కలెక్టర్ జె.నివాస్

-ములపాడు-1 గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
-దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం వంటి అనుమానిత లక్షణాలు ఉన్న వారికే కోవిడ్ పరీక్షలు చేయాలి…
-సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయానికి వచ్చే అన్ని సర్వీసులకు అప్పటికప్పుడే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మూలపాడు-1 గ్రామ సచివాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సచివాలయంలోని అన్ని రికార్డులను పరిశీలించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆయన సిబ్బందిని కోరారు.సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం ఉన్న అనుమానిత లక్షణాలు ఉన్న వారికి మాత్రమే కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయాలని ఏఎన్ఎం ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా మీ సచివాలయం పరిధిలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా ఎంతమందికి వ్యాక్సిన్ ఇవ్వాలి, ఫ్రెంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఎంతమందికి ఇచ్చారు, వంటి వివరాలు అడిగి తెలుసుకొని, రెండో డోసు దగ్గరపడుతున్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సచివాలయ ఏఎన్ఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వీటితో పాటు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రుణం పొంది ఉన్నారు, ఎంతమందికి రుణ విముక్తి పత్రాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ పట్టాలు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి వంటి వివరాలను అడిగి తెలుసుకొని, డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని డిజిటల్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను వారి గడపవద్దే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపారు తదితర వివరాలను కలెక్టర్ జె.నివాస్ అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ లో మండల తహశీల్దార్ ఎం. సూర్య రావు, ఎండివో శ్రీనివాస రావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *