-11వ అదనపు జిల్లా జడ్జి: G.మాలతి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 12 2022 వ న జరుగ నన్న జాతీయ లోక్ అదాలత్ సద్వినయేగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాథికార అద్యక్షులు మరియు “11”వ అదనపు జిల్లా న్యాయమూర్తి G.మాలతి తెలిపారు. ఈ మేర శుక్ర వారం ప్రకటన విడుదల చెస్తూ తెనాలి మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యం లో తెనాలి కోర్టు ప్రాంగణం నందు “జాతీయ లోక్ అదాలత్ నందు మోటార్ వాహన ప్రమాద కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, బ్యాంకు కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరింఛుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.