విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ‘‘మార్పు’’ (చేంజ్‌్) పథకం కింద 131 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను 131 రోజుల్లో మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి సోమవారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌డబ్ల్యుఎస్, సమగ్ర శిక్షాభియాన్, ఏపిఎస్‌డబ్ల్యుఐడిసి కార్యాలయాలలో పనిచేస్తున్న ఎస్‌ఇలు, డిఇలు, ఏడిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలోని విద్యార్థులు అనుభవిస్తున్న వసతులే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న బాలబాలికలకు కల్పించాలనదే మార్పు ఉద్ధేశమన్నారు. పెనమలూరులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన నమూన హాస్టల్ అభివృద్ధి వారం రోజులో పూర్తి కానుందన్నారు. అక్కడ బాత్‌రూమ్‌లకు సిరామిక్ టైల్స్, బ్రాండెడ్ కుళాయి కలెక్షన్లు, విద్యుత్ సౌకర్యం, కన్సీల్డ్ వైరింగ్, పైపులైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్లకు బయట వాష్‌బేసిన్, గోడపై అద్దం అమర్చాలన్నారు. అలాగే మరుగుదొడ్లకు రాకపోకల దారి కూడా టైల్స్‌ను వేయాలన్నారు. స్శానపుగదులు, మరుగుదొడ్లకు మోడరన్ తలుపులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే బస చేసే గదుల కిటికిలకు మస్కిటో నెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యాన్, ఎల్‌ఇడి బల్బుల్ కూడా అమర్చాలని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం ప్రతీ ఇంజనీరింగ్ శాఖ నుంచి ఒక్కొక్క సహాయ ఇంజనీర్ ఒక్కోక్క హస్టల్‌ను ఏంపిక చేసుకుని (దత్తత తీసుకుని) అభివృద్ధి చేసి జిల్లాలోని ఏఇలకు అవగాహన కల్పించాలన్నారు. ఆ తరువాత ఏఇలకు అప్పగించిన హాస్టళ్లు ఇదే రీతీలో అభివృద్ధి చేసి 131 రోజుల్లో నిరుపేద విద్యార్థులకు అందించాలని కలెక్టర్ కోరారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …