విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈబీసీ నేస్తం పథకానీ తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభించినందుకు వారికి అవినాష్ ధన్యవాదములు తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు జగనన్న అన్ని వర్గాల మహిళలు మన్నన్నలు పొందుతున్నారు అని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గం లో 1582 మంది అగ్రవర్ణ పేదలకు 3 విడతలుగా దాదాపు 7 కోట్ల 11 లక్షల రూపాయలు తో వారికీ ఆర్ధిక భరోసా కలుగుతుంది అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఈ పథకం కింద ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు అని అన్నారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, అదనంగా మరెన్నో హామీలు అమలు చేస్తూ, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల వారికి కూడా “వై.యస్.ఆర్.ఈబిసి నేస్తం” ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. తెలుగుదేశం పార్టీ గతంలో మహిళల రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, చేనేతల రుణమాఫీ పేరిట వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా, ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారు. గతంలో మావి మహిళా పక్షపాత ప్రభుత్వం అన్ని చెప్పుకున్నారే గాని అసలైన మహిళా పక్షపాత ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో జగనన్న నిరూపించారు అని అవినాష్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలు అంత అండగా ఉంటారు అని అన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …