Breaking News

ఇబిసి పథకం ద్వారా 30,913 మంది మహిళలకు రూ.46.37 కోట్లు లబ్ధి… : కలెక్టర్‌ జె. నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయిన ఈబీసి ( ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలు)లోని పేద మహిళాలకు మేలు చేకూరీ వారి జీవనోపాధి, ఆర్థికసాధికారతే లక్ష్యంగా వైఎస్సార్‌ ఇబిసి నేస్తం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షత్రియ, వెలమల లతో పాటు ఇతర ఓసి సామాజిక వర్గాలకు చెందిన 3,92,674 మంది పేద మహిళా లబ్దిదారులకు 589 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రతీ ఏడాది 15 వేల రూపాయలు చొప్పున మూడేళ్లలో 45 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారి ఆర్థికంగా స్థిరపడేలా తోడ్పాటు అందించారు.
నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి కలెక్టర్‌ జె. నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె. మోహన్‌కుమార్‌, ఎమ్మెల్యేలు మల్లాది విఘ్ణ వర్థన్‌, కొలుసు పార్థసారధి, జడ్పీచైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, ఏపీఎస్‌ఆర్టీసి జోన్‌ చైర్మన్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ తాతినేని పద్మావతి, బిసి కార్పొరేషన్‌ ఇడి రాజకుమారిలు పాల్గొన్నారు.
జిల్లాలో ఇబిసి నేస్తం పథకం ద్వారా 30,913 మంది మహిళలకు 15 వేల రూపాయల చొప్పున 46.37 కోట్ల రూపాయలు చెక్‌ను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారధి మాట్లాడుతూ దేశంలోనే తొలి సారిగా అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకోనేందుకు ఈబీసి నేస్తం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని కొనియాడారు. మహిళల స్వయం ఉపాధి కోసం ఈ నిధులు దోహదపడతాయన్నారు. కరోనా కష్ట కాలంలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నపట్టికి ఉన్నత వర్గాలోని పేద మహిళలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి తలచారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారన్నారు.
విజయవాడ సెంట్రల్‌ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ తల్లి గర్భంలోని బిడ్డ నుండి వృద్ధాప్యంలోని అవ్వల వరకు అన్ని దశలోను వివిధ రకాల పథకాలతో జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నామినేట్‌ పదవులు, నామీనేషన్‌ పనులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేశామని, స్థానిక సంస్థల పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 61 శాతం పదవులు కేటాయించడం వంటి ఎన్నో మహిళా పక్షపాత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.
కలెక్టర్‌ జె. నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇబీసి పథకానికి 36,521 మంది ధరఖాస్తు చేసుకున్నారని వారిలో 30.913 మంది మహిళా లబ్ధిదారులు అర్హత పొందారన్నారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు వీరిని ఎంపిక చేశారన్నారు. జిల్లాలో ఇబిసి పథకం ద్వారా 30,913 మంది మహిళలకు రూ.46.37 కోట్లు లబ్థి చేకూరనుందని కలెక్టర్‌ అన్నారు.

ఈ సందర్భంగా లబ్దిదారులు తమ మనోభావాలను ఈ విధంగా వ్యక్తం చేశారు…
కె. సాయి దేవి (54), విజయవాడ: అగ్రవర్ణంలో పుట్టిన నాకు మూగ్గురు ఆడపిల్లలే. చిన్న ఉద్యోగం చేసుకుని జీవనం గడుపుతున్నా. వాలంటీర్‌ ఇంటికి వచ్చి ఇబీసి నేస్తం పథకం ద్వారా 15 వేల రూపాయలు మంజూరు అయ్యాయని చెబ్బితే ఎంతో సంతోష పడ్డాను. జగనన్న చల్లని చూపు మాపై కూడా ప్రసరించింది. తొలి సారిగా ప్రభుత్వం నుండి సాయం తీసుకుంట్టున్నాను. ఈ డబ్బులతో జీవనోపాధి మెరుగుపరచుకుంటాను. జిరాక్స్‌ షాపు పెట్టాలనదే నా ఆలోచన.
యం. విజయ (53), కమ్మ కులం, ఒన్‌టౌన్‌, విజయవాడ: 15 వేలు ఇస్తున్నారంటే నాకు నమ్మబుద్ది కాలేదు. వార్డు వాలంటీరి వచ్చి మంగళవారం రోజు కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లాలి అని చెప్పితే నాలో చైతన్యం వచ్చింది. నవరత్నాలో భాగంగా నాకు స్థలం కూడా ఇచ్చారు.
టి. వరలక్ష్మి (49), బ్రాహ్మణ కులం, మచిలీపట్నం: నాకు వితంతువు పెన్షన్‌ వస్తూవుంది. మా అమ్మాయికి విద్య దీవెన పథకం కింద లబ్ధి లభిస్తుంది. జగనన్న ప్రవేశపెట్టిన ఇబీసి నేస్తం ద్వారా 15 వేల రూపాయలు అందుకుంట్టున్నాను. మా పట్టణంలోని బ్రాహ్మణ కులస్తులంతా జగనన్నకు దీవెనలు ఇవ్వమన్నారు. జగనన్న…దీర్ఘాయుశ్యుమానుభావ అని దీవించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *