Breaking News

కనువిందు చేయనున్న గణతంత్ర వేడుకలు…

-త్రివర్ణ పతాకాలతో విద్యుత్‌ దీపాలతో ముస్తాబైన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం…
-పుల్‌ డ్రెస్‌ రిహర్సల్‌ పరిశీలించిన రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్‌పి సిశోడియా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ శోభ, జాతీయ సమైఖ్యత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలతో విద్యుత్‌ దీపాలతో ముస్తాబైన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబందించి మంగళవారం పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ నిర్వహించారు.
స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన 73వ గణతంత్ర వేడుకల పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ను రాష్ట్ర అడిషనల్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా. రవిశంకర్‌అయ్యనార్‌ ఏపిఎస్‌పి బెటాలియాన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ బి. శంకర్‌బ్రాత భక్షి, రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆర్‌పి సిశోడియా, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌, జిఏడి డిప్యూటీ సెక్రటరీ యం బాలాసుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, నగర పోలిస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, పరిశీలించారు. దీనిలో భాగంగా ఈనెల 26వ తేది బుధవారం ఉదయం 8.30 గంటలకు ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యే గణతంత్ర వేడుకలకు పుల్‌ డ్రెస్‌ రిహర్సల్స్‌ నిర్వహించారు.
పోలీస్‌ పెరేడ్‌లో కర్నాటక స్టేట్‌పోలీస్‌, ఎపిఎస్‌పి 2వ బెటాలియన్‌ కర్నూలు, ఎపిఎస్‌పి 3వ బెటాలియన్‌ కాకినాడ, ఎపిఎస్‌పి 5వ బెటాలియన్‌ విజయనగరం, ఏపిఎస్‌పి 9వ బెటాలియన్‌ వెంకటగిరి, ఏపిఎస్‌పి 11 బెటాలియన్‌ కడప, బృందాలతోపాటు బ్రాస్‌ బ్యాండ్‌ ఎపిఎస్‌పి 2 బెటాలియాన్‌ కర్నూలు, 3 బెటాలియన్‌ కాకినాడ, 5వ బెటాలియన్‌ విజయనగరం, 6 బెటాలియన్‌ మంగళగిరి, 9వ బెటాలియన్‌ వెంకటగిరి, 11 బెటాలియన్‌ బకరావు పేట, 14వ బెటాలియన్‌ అనంతపురం, ఎస్‌ఏఆర్‌ సిపిఎల్‌, ఏపి యూనిట్‌ హైదారాబాద్‌, ్‌ పైప్‌ బ్యాండ్‌ ఏపిఎస్‌పి బెటాలియన్‌ మంగళగిరి బృందాలు ఈ కవాతులో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్ణయించిన కాల వ్యవదిలో ఈ బృందాలు పెరేడ్‌ లో పాల్గొని కవాతులు నిర్వహించగా రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ రిహర్సల్స్‌ను తిలకించి పలు సూచనలను చేశారు. రాష్ట్ర గవర్నర్‌ గణతంత్ర దినోత్సవంలో పాల్గొని పోలిస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించడం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చదివే ప్రసంగం కాల వ్యవది, మార్చ్‌ పాస్ట్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల అలంకృత శకటాల ప్రదర్శన, అవార్డులను అందించడం తదితర కార్యక్రమాలన్ని గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన్నట్లుగానే నిర్వహించారు.
ఈ రిహర్సల్స్‌లో శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురామ్‌, జాయింట్‌ కలెక్టర్లు డా.కె. మాధవిలత, కె. మోహన్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *