విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ పున: అంకితం కావలసిన రోజు ఇది. ఈ రోజు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవించేందుకు తోడ్పడిన గొప్ప దేశభక్తులందరి స్మారక దినం. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు పున: అంకితం చేసే రోజు. ఈ పవిత్రమైన రోజున, దేశ నిర్మాణానికి మనల్ని మనం అంకితం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ రోజు నిజంగా చిరస్మరణీయంగా ఉండాలని ప్రజలందరికీ నా హృదయపూర్వక, దేశభక్తి శుభాకాంక్షలు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కరోనా ప్రవర్తనా నియమావళి ని అనుసరించాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను వైరస్ నుండి రక్షించుకోవడానికి అర్హులైన వ్యక్తులందరూ వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి.” అని మాననీయ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …