విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం 73 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26 వ తేదీన అమల్లోకొచ్చి దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన రోజని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణాలు త్యాగాలు చేసిన వారికి ప్రతిఒక్కరూ నివాళులు అర్పించాలని గుర్తు చేశారు. అంబేద్కర్ వల్లనే దేశ ప్రజలకు ఓటు హక్కు కలిగిందని, ప్రజలు స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతృత్వం తో జీవించే అవకాశంతోపాటు మానవహక్కులు రక్షించబడ్డాయని అన్నారు. రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తరువాత జనవరి26న సంపూర్ణ గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నామని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ తరుపున 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ప్రేమరాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వేముల శ్రీనివాస రావు, కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ, సిటీ మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, బి.సి.నాయకులు టి. పెద్ద వెంకటేశ్వర్లు, యూత్ వేముల రామకృష్ణ దాసరి శ్రీనివాసరావు పడమట రవికుమార్, టి. శ్రీనివాసరావు, భాను, స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …